సైబరు మోసగాళ్ళుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వన్ టౌన్ సిఐ బి. వెంకటరావు అన్నారు. విజయనగరం పట్టణం ఉడా కాలనీలోని సైబరు మోసాలు, చిట్టీలు, దొంగతనాలపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మొబైల్స్ కు వచ్చే లింకులు, కే. వై. సి. అప్డేట్ పేరుతో వచ్చే మెసేజ్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యాంకు ఖాతాలు, ఆధార్ అప్డేట్ పేరుతో ఫోన్లు చేసి, ఓటిపి చెప్పమని కోరుతారని, అటువంటి వాటికి ఎవ్వరు స్పందించవద్దని సూచించారు.