తాడిపత్రి బాగుకోసం రూ.100 కోట్లు మంజూరు చేస్తే తాను ఛైర్మన్‌గా రాజీనామా చేస్తానని ప్రభాకర్‌రెడ్డి సవాల్ విసిరారు. తాడిపత్రి మున్సిపాలిటీని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దోచుకుంటున్నాడంటూ మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ కోసం మున్సిపాలిటీ స్థలాన్ని తీసుకుంటున్నారని.. అక్కడ నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా వైసీపీ ఆడించినట్లు ఎస్పీ ఆడుతున్నారని ఆరోపించారు.