బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఈ కేసులో దోషులను మాత్రమే సత్ప్రవర్తన కింద ఎలా విడుదల చేశారని గుజరాత్ ప్రభుత్వాన్ని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై గుజరాత్ ప్రభుత్వ స్పందన కోరింది. ఈ నెల 24కు తదుపరి విచారణను వాయిదా వేసింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బాధితురాలిపై నిందితులు సామూహిక అత్యాచారం చేశారు.