ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జన్ ధన్ ఖాతాలకు సంబంధించి కీలక విషయాన్ని కేంద్రం వెల్లడించింది. దేశంలో జన్‌ధన్ ఖాతాలు 50 కోట్లు దాటినట్లు తెలిపింది. ఇందులో 56 శాతం మహిళల పేరుతోనే జన్‌ధన్ ఖాతాలు ఓపెన్ అవ్వడం గమనార్హం. జన్‌ధన్ ఖాతాల్లో రూ.2 లక్షల కోట్ల డిపాజిట్లు అయినట్లు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది.