సర్పంచ్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. నేడు అయన మాట్లాడుతూ... దెందులూరు నియోజకవర్గం వీరమ్మకుంటలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీల దాడి దుర్మార్గమని మండిపడ్డారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అండచూసుకునే వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారన్నారు. అధికార పార్టీకు పోలీసులు వత్తాసు పలకడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి ఒక రూలు - ప్రతిపక్షానికి ఒక రూలా అని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దెందులూరు నుంచి పారిపోవడం ఖాయమన్నారు.