దేశీయంగా బియ్యం ధరల అదుపునకు ఎగుమతులపై కేంద్రం నిషేదం విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉల్లి విషయంలోనూ దాదాపు అలాంటి నిర్ణయమే తీసుకుంది. ఉల్లి ధరలను అదుపు చేసి తద్వారా దేశీయంగా సరఫరా పెంచే ఉద్దేశంతో ఎగుమతులపై 40 శాతం సుంకం విధించింది. డిసెంబర్ 31 వరకు ఈ పన్ను అమల్లో ఉంటుందని పేర్కొంది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.