ఐర్లాండ్‌తో డబ్లిన్‌లో ఆదివారం రాత్రి 7.30కి రెండో టీ20లో టీమిండియా తలపడనుంది. తొలి టీ20లో ఐర్లాండ్‌పై విజయం సాధించిన భారత్ రెండో టీ20లోనూ గెలవాలని పట్టుదలతో ఉంది. ఇక తొలి టీ20లో విఫలమైన బౌలర్ అర్ష్‌దీప్ స్థానంలో అవేశ్‌ఖాన్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ బుమ్రా, బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఫామ్ అందుకోవడం టీమిండియాకు శుభపరిణామం. తొలి టీ20లో ఓడిన ఐర్లాండ్ జట్టు పైనే ప్రస్తుతం ఒత్తిడి ఉంది.