ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో తమకు ఛాన్స్ ఇస్తే ఉచిత విద్యుత్ సహా, మహిళలు, నిరుద్యోగులకు అలవెన్స్ ఇస్తామని ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రతి ఇంటికీ 300 యూనిట్ల ఫ్రీ కరెంట్, మహిళలకు రూ.1000, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి, సీనియర్ సిటిజన్లకు ఫ్రీగా తీర్థయాత్రలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ వంటి హామీలిచ్చారు.