బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. రమేష్ అనే యువకుడికి ఓ యువతితో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. ఈ నెల 12న రమేష్ స్నానం చేస్తుండగా బాత్రూమ్కు బయట అతడి భార్య తాళం వేసింది. అనంతరం భర్త ఫ్రెండ్ కార్తీక్‌తో ఆమె వెళ్లిపోయింది. బయటకు వచ్చాక ఇంట్లో నగలు, డబ్బు మాయం అయ్యాయని రమేష్ గుర్తించాడు. భార్య కోసం గాలించినా దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.