గుంతకల్లు, వజ్రకరూరు మండలాల్లోని గ్రామాలకు పిల్ల కాలువలు తవ్వించి రాగులపాడు ఎత్తిపోతలు ద్వారా రైతులు, ప్రజలకు సాగు, తాగు నీరు అందించాలని సిపిఎం చేపట్టిన పాదయాత్ర రెండవ రోజు బుధవారం గుంతకల్లు గ్రామాలకు చేరింది. మండలంలోని నెలగొండ, దోనిముక్కల తదితర గ్రామాల్లో నాయకులు పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం అనుబంధ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, నాయకుడు కృష్ణ మూర్తి పాల్గొన్నారు.