ఇల్లు లేని గిరిజనులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన్న అన్నారు. ఈ మేరకు గుమ్మలక్ష్మీపురం తాసిల్దార్ కార్యాలయం వద్ద బుధవారం నిరసన తెలియజేశారు. ఇల్లు లేని ప్రతి గిరిజన కుటుంబానికి ఇల్లు మంజూరు చేసేంతవరకు మూడు రోజులు పాటు నిరాహార దీక్ష కొనసాగిస్తామని అన్నారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.