చంద్రయాన్-3పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అవగాహనాలేమి వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మ బదులుగా రాకేష్ రోషన్ అంటూ వ్యాఖ్యానించారు. ‘గతంలో రాకేష్ రోషన్ చంద్రుడిపైకి వెళ్లినప్పుడు, చంద్రుడిపై నుంచి చూస్తే భారతదేశం ఎలా కనిపిస్తోందని ఇందిరాగాంధీ ఆయనను ప్రశ్నించారు’ అని మమతా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవడంతో.. ట్రోలర్స్ సీఎంను ఏకిపారేస్తున్నారు.