చెన్నైకొత్తపల్లి మండలం సికేపల్లిలో పూర్తిగా నష్టపోయిన వేరుశనగ పంటను గురువారం ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జేవీ రమణ పరిశీలించారు. వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వేరుశనగ, కంది, మొక్కజొన్న , తదితర పంటలు వర్షం లేక పూర్తిస్థాయిలో ఎండిపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని అన్నారు. బ్యాంకులలో ఉన్న రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని,నష్టపరిహారం వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.