కొమరోలు మండలం బెడుసుపల్లి గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది. సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై తెలిపారు.