కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జీ-20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశాలు జరగనున్న నేపథ్యంలో దిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీ వరకు దిల్లీలో ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలూ మూసే ఉంటాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.