గుంటూరు పట్టణం ఏటీ అగ్రహారంలో నివసించే కూరపాటి లూకా (32) బుధవారం మంచం మీద నుంచి కిందపడి మృతి చెందాడు. ఆలస్యంగా గుర్తించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గురువారం మృతుడి తండ్రి నరసింహారావు ఫిర్యాదు మేరకు నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు