విశాఖపట్నంలో ఇటీవల ప్రారంభించిన మోడ్రన్ బస్ షెల్టర్ ఒక్కసారిగా కూలిపోయింది. రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ బస్షెల్టర్ను ఐదు రోజుల క్రితం నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి ప్రారంభించారు. రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన నిర్మాణం, ప్రారంభించిన ఐదు రోజులకే కుంగిపోవడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఘటన జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.