తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. స్వామి దర్శనం కోసం 25 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం 79,152 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. 30,329 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా, శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు రెండో రోజు ఘనంగా సాగుతున్నాయి.