ఒంగోలు నియోజకవర్గంలో అధికార పార్టీకి సంభందించి పిల్ల సైకో తయారయ్యాడని, టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని లెక్కలు తేలుస్తామని తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షు డు దామచర్ల జనార్దన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ...... సైకో పాలనలో అన్నీ వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని, అధైర్యపడవద్దని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. నగరంలో పిల్ల సైకో తయారయ్యాడని, పార్టీలో కొత్తగా చేరుతున్న వారిని, అలాగే టీడీపీ తరుపున పెట్టే మీటింగ్‌ల కు ఆయా ప్రాంతాల స్థానిక నాయకులకు ఫోన్‌లు చేసి బెదిరిస్తున్నాడని మండిపడ్డారు.అలాగే ప్రభుత్వ అధికారులు కూడా వైసీపీ వారిని భుజాన వేసు కుని పనిచేస్తున్నారని, ఇలాం టి విధానం సరికాదని హి తవు పలికారు.