అనంతపురం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ ఈబి దేవి సోమవారం విధుల్లో చేరారు. తిరుపతి జిల్లా రుయా ఆసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ ఎం ఓగా పని చేస్తున్నటు ఈమె ప్రమోషన్ పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా అనంతపురంలో చేరారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని తన చాంబర్లో నూతనంగా విధుల్లో చేరిన దేవిని ఇన్చార్జి డిఎంహెచ్ ఓ డాక్టర్ యుగంధర్, కార్యాలయ సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.