ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం పొట్లపాడు గ్రామం రామయోగి స్వామి దేవస్థానం సమీపంలో ఓ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదంగా మారింది. ఈ సందర్భంగా సోమవారం నాడు ట్రాన్స్ఫార్మర్ చాలా కిందకి ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ వలయం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు.