యూకే పర్యటనకు అనుమతించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో దేశం విడిచి వెళ్లిపోవద్దనే షరతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన యూకే పర్యటనకు అనుమతి కోసం సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. తనకు దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించాలని కోరారు. జగన్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరింది. అనంతరం కోర్టు విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. మరోవైపు యూకే, అమెరికా, జర్మనీ, దుబాయ్, సింగపూర్ తదితర విదేశీ పర్యటనలకు అనుమతి కోరుతూ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు.