కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు ను మంగళవారం ఇ. వి. మహేశ్వరరెడ్డి కలిసి వినతి పత్రం సమర్పించారు. మైదుకూరు లో నాఫెడ్ సంస్థ ఏర్పాటు వలన రైతాంగానికి విస్తృత ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయని ఉల్లిపాయలు ఒకటే కాకుండా ధాన్యం, కూరగాయల కోనుగోలు చేస్తున్నదని దాని వలన గిట్టుబాటు ధర ప్రభుత్వ వత్తిడి లేకుండా కోనుగోలు చేస్తారని అన్నారు. కలెక్టర్ సెప్టెంబర్ లో సిసిఎయల్ వారికి తిరిగి ప్రతిపాదన పంపుతామని చెప్పారు.