గృహసారథులు, నాయకులు, కార్యకర్తలు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం పీలేరులో నియోజకవర్గ స్థాయి గృహసారథులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి సిఎంని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జివి శ్రీనాథ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.