గుంటూరు పట్టణంలోని ఓ లాడ్జిపై కొత్తపేట సీఐ అన్వర్ బాషా ఆధ్వర్యంలో దాడి చేశారు. లాడ్జి యజమానులు కొంతమంది మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో సోమవారం కొత్తపేట పోలీసులు లాడ్జిని పరిశీలించి పలువురిని అరెస్ట్ చేశారు. ఎవరైనా సరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని సీఐ హెచ్చరించారు.