లోక్‌సభ ఎన్నికల సమయంలో దక్షిణ భారతదేశంలో బీజేపీని బలోపేతం చేయడంపై పార్టీ దృష్టి సారించింది. అధికార పార్టీ జాతీయ ప్రతినిధిగా కాంగ్రెస్ ముఖ్యనేత, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ మంగళవారం వెల్లడించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది.