మణిపూర్ లో తాజాగా రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. బిష్ణుపూర్ జిల్లాలో నరైన్ సెన్ లో మంగళవారం ఇరు వర్గాలు భారీ స్థాయిలో కాల్పులు జరిపాయి. పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చి, వేర్వేరు గ్రూపులకు చెందిన నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి ఆయుధాలు, సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. కాగా, 5 జిల్లాల్లో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.