కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 4న జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాలు వద్ద ధర్నాలు జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం శ్రీకాకుళంలో పలు వార్డుల్లో కరపత్రాలు ప్రచారం, సంతకాల సేకరణ నిర్వహించారు.