రక్షాబంధన్.. సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. రక్షాబంధన్ పండుగను రాఖీ పండుగ అని, రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. రాష్ట్రవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పిల్లలు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల సోదర ప్రేమ, కృతజ్ఞతను తెలియజేస్తూ ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించారు. రాష్ట్రానికి రక్షణ మన జగనన్నే అని నినదిస్తూ విద్యార్థులు రాఖీ ఆకారంలో రాష్ట్రవ్యాప్తంగా పలు స్కూళ్లలో మానవహారంగా ఏర్పడి తమ ప్రియతమ నాయకులు సీఎం వైయస్ జగన్ పై సోదర ప్రేమ వ్యక్త పరిచారు. ఈ అందమైన రాఖీ ఆకారాలు రాష్ట్రంలో పిల్లలకు ఒక నాయకుడికి మధ్య ఉన్న బంధాన్ని వివరిస్తుంది.