యూకే వెళ్లేందుకు అనుమతించాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయాన్ని సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. దీంతో సీబీఐ కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరారు. నేటితో వాదనలు ముగియడంతో కోర్టు తన నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది.