జమ్మూకశ్మీర్ లో ఏ క్షణమైనా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడానికి ఏమైనా కాల పరిమితి ఉందా? అన్న ప్రశ్నకు కేంద్రం గురువారం సమాధానం ఇచ్చింది. దీనికి అవసరమైన నియమావళి రూపొందిస్తున్నామని, కొంత సమయం పడుతుందని పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కొద్ది రోజులుగా విచారణ జరుగుతోంది.