ఏపీలో శుక్రవారం నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి రానుంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కొత్తగా CARD 2.0 సాఫ్ట్వేర్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ప్రజలు నేరుగా ఆన్లైన్లో దస్తావేజులు తయారు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కొత్త ఆన్లైన్ విధానాన్ని సెప్టెంబర్ 15 నాటికి దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకు రానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.