అనంతపురం జిల్లా, గాండ్లపెంట, మండలకేంద్రంలోని ఎమ్మార్సీ భవనం వద్ద గురువారం పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు నిరసనలో పాల్గొని ఫ్లకార్డులు చేతపట్టి సీపీఎ్‌సను రద్దు చేసి, ఓపీఎ్‌సను పునరుద్ధరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ...... వైఎస్ జగన ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు పాదయాత్రలో తాము అధకారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎ్‌సను తీసుకొస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా ఇంత వరకు ఆ హామీని నిలబెట్టుకోలేదని వాపోయారు. ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈనెల 1వ తేదీని చీకటి దినంగా ప్రకటిస్తూ నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలుపుతామన్నారు.