తమిళనాడు యువజన సంక్షేమం మరియు క్రీడల అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ శనివారం మాట్లాడుతూ సనాతన అనేది వ్యాధి లాంటిదని, కాబట్టి దీనిని నిర్మూలించాలి అని అన్నారు. మీరు సదస్సు పేరును 'సనాతన వ్యతిరేక సదస్సు' అని కాకుండా 'సనాతన నిర్మూలన సదస్సు' అని ఉంచారు, నేను దానిని అభినందిస్తున్నాను, ”అని ఉదయనిధి అన్నారు.ఎలాంటి న్యాయపరమైన సవాలునైనా ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి సాధారణ కాషాయ బెదిరింపులకు మేము భయపడము. పెరియార్, అన్నా, కలైంజ్ఞర్ అనుచరులమైన మేం సామాజిక న్యాయాన్ని నిలబెట్టేందుకు, మా సీఎం ఎంకే స్టాలిన్ మార్గదర్శకత్వంలో సమతా సమాజాన్ని నెలకొల్పేందుకు ఎప్పటికీ పోరాడుతాం అని అన్నారు.