ఒడిశాలో పిడుగుపాటుకు 10 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గురు గాయపడ్డారని పేర్కొన్నారు. భువనేశ్వర్, కటక్ సహా ఒడిశా తీర ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. రానున్న 4 రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం, మెరుపులు వచ్చే సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.