చిలకలూరిపేట నియోజకవర్గంలోని 69 మందికి ముఖ్య మంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 53 లక్షల 25 వేల రూపాయల చెక్కులను మంత్రి విడదల రజిని శనివారం అందజేశారు. పురుషోత్తమపట్నం 30వ వార్డుకి చెందిన షేక్ కరిమియా రూ. 5 లక్షలు, పండరిపురం 36 వ వార్డుకి చెందిన బత్తుల సుబ్బారావుకి రూ. 3లక్షల 75వేలు, నాదెండ్ల మండలం అప్పాపురంకి చెందిన నాయుడు పుష్పవతికి రూ. 1 లక్ష 20వేల చెక్కులను ఆమె అందజేశారు.