ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ ఒడెసా ప్రాంతంలో రష్యా డ్రోన్ల దాడి జరిగిన కొన్ని గంటలకే జెలెన్స్కీ ఉక్రెయిన్ రక్షణ మంత్రిగా పనిచేస్తున్న ఒలెక్సీ రెజ్నికోవ్ను తొలగించారు. ఆయన స్థానంలో క్రిమియన్ టాటర్కు చెందిన రుస్టెమ్ ఉమెరోవ్ను కొత్త రక్షణ మంత్రిగా నియమించారు. యుద్ధంలో ఉక్రెయిన్ సైన్యానికి కొత్త విధానాలు అవసరమని చెప్పారు.