ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జల్లికట్టు నిర్వహణపై విభేదాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 04, 2023, 12:20 PM

కుప్పం, నియోజకవర్గం వానగట్టపల్లె పంచాయతీలో ఆదివారం జల్లికట్టు నిర్వహణకు అధికార పార్టీలోని ఓ వర్గం నిర్ణయించింది. ఎంపీటీసీ మంగమ్మ కొడుకు బసవరాజు, అదే పార్టీకి చెందిన నాయకులు లక్ష్మీకాంతయ్య, మోహన్‌, శివ తదితరులు ఈ వర్గంలో ఉండి దీనికి విస్తృత ప్రచారం కల్పించారు. ప్రచార కరపత్రంలో సర్పంచి పార్వతమ్మ కుమారుడు రామచంద్ర, పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్‌ కృష్ణప్ప తదితరుల పేర్లనూ ముద్రించారు. ఇక్కడ ఏ విషయంలో తేడా వచ్చిందో కానీ, సర్పంచి పార్వతమ్మ వర్గం జల్లికట్టును వ్యతిరేకించింది. తమను కనీసం సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని, జల్లికట్టువల్ల శాంతిభద్రతలు క్షీణిస్తాయని పేర్కొంటూ వెంటనే జల్లికట్టును ఆపాల్సిందిగా కుప్పం అర్బన్‌ పోలీసులకు మూడునాలుగు రోజుల క్రితం రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేసింది. తర్వాత ఎమ్మెల్సీ భరత్‌ జోక్యం చేసుకుని ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చడంతో జల్లికట్టు నిర్వహణకు మార్గం సుగమమమైంది. మళ్లీ ఏం జరిగిందో కానీ, జల్లికట్టును నిర్వహించరాదంటూ పోలీసులు నిర్వాహకులకు శనివారం తాఖీదులు పంపారు. దీని వెనుక సర్పంచి వర్గముందని కినుక వహించిన ఎంపీటీసీ వర్గానికి చెందిన వైసీపీ పంచాయతీ ప్రెసిడెంట్‌, సచివాలయ కన్వీనర్‌ కూడా అయిన కృష్ణప్ప, తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అదేరోజు మీడియా ముఖంగా ప్రకటించారు. అయినా సరే, ఆదివారం జల్లికట్టు జరగకుండా సర్పంచి వర్గం అడ్డుకోగలిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa