ఢిల్లీలో ఈ నెల 18 నుంచి 22 వరకు జరగనున్న ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టకుంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం తప్పదని ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (మందక్రిష్ణవర్గం) కడప జిల్లా నూతన అధ్యక్షుడు మానికింది వెంకటేశ్ మాదిగ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగల భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని, గత 29 సంవత్సరాలుగా మాదిగలు అలుపెరగని పోరుబాట సాగిస్తున్నా పాలకులకు కనికరం లేకపోవడం దారుణమన్నారు. మందక్రిష్ణ మాదిగ ఆదేశాల అమేరకు ఎంఎ్‌సపి, ఎమ్మార్పీఎస్, ఎంఈఎస్. ఎంఎ్‌సఎఫ్, వీహెచ్‌పీఎస్ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం బాలాజీనగర్‌లోని యూటీఎఫ్ భవన్ లో జిల్లా స్థాయి విస్తృత సమావేశం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa