చంద్రబాబు పాపం పండింది.. అవినీతి బట్టబయలైందని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. అమరావతిలో రాజధాని కడతానని, ప్రతి ఇటుకకు డబ్బులివ్వండి అని, మనల్ని అందర్నీ తాకకట్టు పెట్టి బాండ్స్ ఇష్యూ చేసి తెచ్చిన డబ్బులు ఆయా కంపెనీలకు ఇచ్చారు. ఆ కంపెనీల ద్వారా నిధులు డొల్ల కంపెనీలకు మళ్లించారని ఇన్ కం ట్యాక్స్ శాఖ నోటీసులు చూస్తే మొత్తం రూ.160 కోట్ల రూపాయలు కొట్టేశారని తేలిందన్నారు.