ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇద్దరు నిందితులకు రాష్ట్ర సీఐడీ నోటీసులు జారీ చేసింది. షాపూజీ పల్లోంజీ సంస్థకు కన్సల్టెంట్‌గా పనిచేసిన మనోజ్ వాసుదేవ్ పార్థసానితోపాటు యోగేష్ గుప్తాను విచారణకు పిలిచినట్లు తెలిసింది. ఆదాయపు పన్ను శాఖ ఇటీవల చంద్రబాబుకు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మనోజ్‌ను విచారణకు పిలవడం చర్చనీయాంశమైంది.