రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సుమారు 3,200 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గత 15ఏళ్లుగా వర్సిటీల్లో నియామకాలు చేపట్టకపోవడంతో శాశ్వత అధ్యాపకుల కొరత ఏర్పడిందని చెప్పారు. డిసెంబరులోగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేయాలని భావిస్తున్నామని తెలిపారు.