ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో బుధవారం పర్యటిస్తారు. 7వ తేదీన గుంతకల్లు నియోజకవర్గంలో పర్యటిస్తారు. రాయదుర్గం నుంచి బుధవారం ఉదయం 11.30 గంటలకు బయలుదేరి ఉరవకొండ నియోజకవర్గంలోని పెద్దకౌకుంట్ల గ్రామానికి 12.30 గంటలకు చేరుకుంటారు. పీఏసీ చైర్మెన పయ్యావుల కేశవ్ తనయుడు విక్రమ్‌సింహ వివాహ రిసెప్షనలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి, సాయంత్రం 4.15 గంటలకు కళ్యాణదుర్గం వాల్మీకి సర్కిల్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు కళ్యాణదుర్గం టీ సర్కిల్‌కు చేరుకుని, ‘బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ’ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం శ్రీనివాస కళ్యాణ మండపంలో రాత్రికి బస చేస్తారు. 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి గుత్తిలోని తాడిపత్రి సర్కిల్‌కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన ‘బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ’ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం నంద్యాల జిల్లా బనగానపల్లెకు బయలుదేరుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa