మండల కేంద్రం భట్టిప్రోలు గ్రామంలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున గ్రామంలో పర్యటించారు. ఇంటింటికి తిరుగి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబానికి అందిన ఆర్థిక సహాయాన్ని కరపత్రాల రూపంలో అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పార్టీ వివిధ శ్రేణుల నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa