తనపై జరుగుతున్న ప్రచారంపై మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరణ ఇచ్చారు. గురువుల కంటే గూగుల్ మేలు అని తాను వ్యాఖ్యానించినట్లుగా ప్రచారం సాగుతోందని, తాను అనని మాటలను అన్నట్లుగా చెబుతున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... గురువుల కంటే గూగుల్ మేలు అని తాను అనలేదని, ఈ తరహా వార్తలను తాను ఖండిస్తున్నానన్నారు. మారుతున్న కాలంతో కొందరు టెక్నాలజీని అందిపుచ్చుకొని గూగుల్‌పై ఆధారపడుతూ గురువులను మరిచిపోతున్నారనే ఉద్ధేశ్యంతో తాను మాట్లాడినట్లు చెప్పారు. తల్లిదండ్రులు, గురువులపై గౌరవం కలిగిన వ్యక్తినని, తాను అలాంటి వ్యాఖ్యలు చేయనన్నారు.