ఇటీవల కర్ణాటక, హరియాణ రాష్ట్ర గవర్నర్ ల సత్కారం అందుకున్న తెనాలికి చెందిన నృత్య కళాకారిణులు గ్రీష్మ శ్రీ, తహసీన్ లను తెనాలి మున్సిపల్ చైర్ పర్సన్ ఖాలేద నసీమ్ శుక్రవారం శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఇరువురికి 5 వేల రూపాయలు నగదు బహమతి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. చిన్న వయసులోనే కర్ణాటక, హరియాణ రాష్ట్ర గవర్నర్ ల ముందు రాజ్ భవన్ లో నృత్య ప్రదర్శన చేసే అవకాశం రావడం గర్వకారణం అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa