ఇండియా వర్సెస్ భారత్ రగడపై కేంద్రప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. దేశాన్ని ఇండియా లేదా భారత్ అనే పేర్లతో పిలవడం ఆమోదయోగ్యమే అయినా పేరు మార్పు వెనుక ఉద్దేశాలే కీలకమని చెప్పారు. విపక్ష కూటమికి ఇండియా పేరు పెట్టడంతోనే దేశం పేరును కేంద్రం పూనుకుందని ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం రెండు పేర్లు సరైనవేనని అన్నారు.