చంద్రబాబును ఎందుకు శిక్షించకూడదు అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. విపక్ష నేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో విచారణ ఎదుర్కొంటుండడంపై ఆయన స్పందించారు. ఏం... చంద్రబాబును ఎందుకు శిక్షించకూడదు? అని ప్రశ్నించారు. ఏపీలో వ్యవస్థీకృత అవినీతి, మనీ లాండరింగ్, దోపిడీల రావణాసుర చరిత్రకు ముగింపు పలకాలి అని పిలుపునిచ్చారు.
ఏపీ సీఆర్డీఏ స్కాం, ఏపీ ఫైబర్ నెట్ స్కాం, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం, అమరావతి భూకుంభకోణం, ఈఎస్ఐ మెడికల్ కొనుగోళ్ల స్కాం, ఓటుకు నోటు కుంభకోణం (2016), కాల్ మనీ కుంభకోణం... ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాంతాడంత ఉంటుందని విజయసాయి వివరించారు.