తెలుగుదేశం పార్టీ నేతలపై భారీ కుట్ర జరుగుతోందని.. జాగ్రత్తగా ఉండాలని పార్టీ శ్రేణులకు టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుకు రిమాండ్ విధించిన తరుణంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని, న్యాయస్థానాలను, న్యాయమూర్తులను దూషిస్తూ పోస్టులు పెట్టవద్దని సూచించారు. పోలీసులు సైబర్ నిఘా ఉంచారని, బైండోవర్ కేసులు పెట్టాలని చూస్తున్నారని వెల్లడించారు. ఇప్పుడు గొడవలు జరిగితే.. ఎన్నికల సంఘానికి నివేదిస్తారని, ఆవేశపడవద్దని తెలిపారు.