తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు కోర్టులో నిలబడవు అని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం ఆయనపై పెట్టిన అక్రమ కేసులు కోర్టులో నిలబడవని చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అంటూ తమ అధినేతపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. ఈ కేసు విషయంలో సీఐడీ అధికారుల తీరుపై సందేహాలను లేవనెత్తారు. తొలుత నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరులేదని కన్నా లక్ష్మీనారాయణ గుర్తుచేశారు. తాజాగా కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో హడావుడిగా చంద్రబాబు పేరును చేర్చారని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ తప్పుడు కేసేనని, ప్రశ్నించిన వారిని కేసుల పేరుతో వేధించడం జగన్ కు అలవాటేనని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం టీడీపీ చీఫ్ పై కక్ష సాధిస్తోందని విమర్శించారు. ఈ వేధింపులకు ప్రజలే తగిన బుద్ది చెబుతారని, ప్రజాకోర్టులో జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు.